News March 2, 2025

హన్మకొండలో రేపు ప్రజావాణి రద్దు

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు  కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా రేపటి ప్రజావాణిని రద్దు చేశామన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News January 4, 2026

రేపు బీఆర్ఎస్ PPT

image

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో నిర్వహించిన చర్చకు కౌంటర్‌గా బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట PPT ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా రాష్ట్ర ఏర్పాటు సమయంలో నీటి కేటాయింపుల్లో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి అన్యాయం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.

News January 4, 2026

సమ్మక్క, సారలమ్మ గద్దెలపై హుండీల ఏర్పాటు

image

మేడారం మహా జాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. జాతరకు ముందే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెలపై ముందస్తుగా పూజారులు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీలు ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజుల గద్దెలపై హుండీలను సీల్ వేసి ఏర్పాటు చేస్తున్నారు.

News January 4, 2026

నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

నేరేడుగొమ్ము: ప్రేమ విఫలం .. పీఎస్‌లో యువతి సూసైడ్ అటెంప్ట్
నల్గొండ: నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు
దామరచర్ల: పల్టీ కొట్టిన కారు
నల్గొండ: నీటి వాటాలో తెలంగాణ ద్రోహం : ఉత్తమ్
నల్గొండ: పట్టణాల్లో వేడెక్కిన పుర రాజకీయాలు
మిర్యాలగూడ: ఐదేళ్లలో 13 వేలకు పైగా పెరిగిన ఓటర్లు
నల్గొండ: పల్లె వెలుగు.. ఇక కనుమరుగు
నల్గొండ: రేపటి నుంచి టెట్ పరీక్షలు
నల్గొండ: మళ్లీ పడగా విప్పుతున్న కుష్టు