News April 11, 2025
హన్మకొండ: ఉరేసుకొని సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాజీపేటలో జరిగింది. SI నవీన్ కుమార్ వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సంజయ్ కుమార్(26) కొత్తగూడెం సింగరేణి వర్క్‌షాప్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. అయితే కాజీపేటలోని బాపూజీనగర్ కాలనీలో మూడు నెలల క్రితం రూ.76లక్షలతో ఇల్లు కొన్నాడు. దీంతో అప్పులు, వడ్డీలు పెరగడంతో మనస్తాపానికి గురై అమ్మమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News October 27, 2025
యజ్ఞంలా కోటి సంతకాల సేకరణ: YCP

AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని YCP ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్‌రెడ్డి, YS మనోహర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.
News October 27, 2025
మొంథా తుపాన్: విజయనగరానికి రూ.కోటి

మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు రూ.కోటి, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ. 50లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో తీర ప్రాంతం ఉండడంతో నష్టం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నిధులను రూ.కోటి మంజూరు చేసింది. ఆయా నిధులను నష్టం నివారణకు ఖర్చు చేయాల్సి ఉంది.
News October 27, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16 వేలు, వండర్ హాట్ (WH) మిర్చి రూ.16,600 పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15 వేలు పలికింది. మక్కలు(బిల్టీ)కి రూ.2050 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.


