News January 31, 2025
హన్మకొండ జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

> HNK: ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రారంభమైన జాతీయ సదస్సు
> HNK జిల్లాలో గాంధీ వర్ధంతి
> HNK: పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించిన అడిషనల్ DGP
> HNK: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి: కలెక్టర్ ప్రావీణ్య
> HNK: గాంధీ విగ్రహం ఎదుట BRS నిరసన
> BC యుద్ధ భేరి సభను విజయవంతం చేయాలి: సినీ నటుడు సుమన్
> HNK: స్వల్పంగా పెరిగిన పత్తి ధర
Similar News
News July 6, 2025
ధర్మపురి : ‘పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదు’

పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న గదులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. వైద్య సేవలు, శుభ్రతపై సమీక్షించి, అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేంద్రం పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
News July 6, 2025
ధర్మపురి : ‘ప్రమాదకర గదులను వెంటనే కూల్చండి’

ప్రమాదకర గదులు వెంటనే కూల్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. గదుల స్థితి దారుణంగా ఉండటాన్ని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సానిటేషన్ పనులపై సమీక్షించి, డ్రైనేజీలు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
News July 6, 2025
జగిత్యాల :రేపటితో ముగియనున్న పీరీల పండుగ

జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో 11 రోజుల పాటు పెద్దపులి వేషధారణలతో జరుపుకున్న పీరీల పండుగ రేపటితో ముగియనుంది. నిన్న చిన్న సర్గత్తి పురస్కరించుకొని భక్తులు మట్కిలు తీసి మొక్కులు సమర్పించుకున్నారు. రేపు పెద్ద సర్గత్తి కావడంతో వేడుకలు అంబరాన్నంటనున్నాయి. రేపు తొలి ఏకాదశి కావడంతో పలు మండలాల్లో సోమవారం మొహర్రం పండుగ నిర్వహించనున్నారు.