News April 15, 2025

హన్మకొండ: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటింటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూరప్రాంతాలకు పంపవద్దని, బైకులు, ఫోన్ ఎక్కువగా వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, హన్మకొండ జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News September 16, 2025

శుభ సమయం (16-09-2025) మంగళవారం

image

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు

News September 16, 2025

స్వస్త్ నారీ, సశక్త్ పరివార్‌ను సక్సెస్ చేయాలి: కలెక్టర్ తేజస్

image

‘స్వస్త్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.

News September 16, 2025

మెదక్: రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్: హరీశ్‌రావు

image

కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్‌ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఆపేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని ఆయన విమర్శించారు. డ్రామాలు కట్టిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.