News March 31, 2025
హన్మకొండ: GREAT.. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన సోని

హనుమకొండ టైలర్స్ స్ట్రీట్కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని తోట సోని తెలిపారు.
Similar News
News November 6, 2025
సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్గా పనిచేశారు.
News November 6, 2025
గద్వాల్: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

గద్వాల పట్టణంలోని బీడి కాలనీకి చెందిన సలీం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలం వేస్తుండగా జారి ప్రమాదవశాత్తు రేకులపల్లి వద్ద ఉన్న గుండాల జలపాతంలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అతడి కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని వెలికితీసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తండ్రి మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 6, 2025
పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్.!

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు క్యాబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ముందుగా పుంగనూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వినిపించాయి. కాగా పీలేరులో ఏఏ మండాలలు ఉంటాయో స్పష్టత రావాల్సి ఉంది.


