News March 20, 2025
హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్

పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్లో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. వెంకటేష్ నిత్యం తాగి వచ్చి తల్లి లక్ష్మమ్మ, భార్య సబితను వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఈనెల 19న తల్లి, భార్య ఇద్దరు కలిసి ఐరన్ రాడ్తో అతడి చెవి భాగాన కొట్టి చంపారు. నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Similar News
News October 26, 2025
కొండారెడ్డిపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 38.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగల 32.8, కొండనాగుల, పెద్దుర్ 32.0, పదర 20.5, అచ్చంపేట 18.8, తిమ్మాజిపేట17.5, వంకేశ్వర్ 16.8, మంగనూర్ 4.5, యంగంపల్లి 3.5, తెల్కపల్లి 2.8, అత్యల్పంగా సిర్సనగండ్ల, ఐనోల్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
News October 26, 2025
ఖమ్మం ఉద్యాన అధికారికి ‘రైతు నేస్తం’ పురస్కారం

HYDలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఉద్యాన అధికారి ఆకుల వేణు పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం వ్యవస్థాపకుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అతిథులు అభినందించారు.
News October 26, 2025
తుఫాను.. సెలవులపై కాసేపట్లో నిర్ణయం!

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండనుంది. దీంతో సోమవారం నుంచి చాలా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఇదే పెద్ద తుఫాను కావడంతో CM ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెలవులిచ్చారు. ఈ సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ సమీక్ష నిర్వహించి ఏయే జిల్లాల్లో సెలవులివ్వాలి, తల్లిదండ్రులకు మెసేజులు పంపాలనే దానిపై చర్చించనున్నారు.


