News February 23, 2025
హన్మాజీపేట పాఠశాల వజ్రోత్సవం.. సీఎం శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట పాఠశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖను విడుదల చేశారు. 75 ఏళ్లుగా అంకితభావం, శ్రద్ధ, పట్టుదలతో అనేకమంది విద్యార్థులకు ఈ పాఠశాల విద్యాబుద్ధులు నేర్పిందని అన్నారు. కవి, రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మించటం స్ఫూర్తి దాయకమన్నారు.
Similar News
News December 5, 2025
నిర్మల్: ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

కలెక్టరేట్‌లో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ మండలాల వారిగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బందిని నియమించామన్నారు.
News December 5, 2025
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్‌కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.
News December 5, 2025
ఎన్నికల నియమావళి అమలు చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి పనిని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.


