News March 4, 2025

హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

image

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బు కోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News March 5, 2026

హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

image

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

News March 5, 2026

అల్లూరి జిల్లాలో 108 మంది ఇంటర్ పరీక్షలకు దూరం

image

అల్లూరి జిల్లాలో గురువారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 108మంది గైర్హాజర్ అయ్యారని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. అల్లూరి జిల్లాలో 513 మందికి గాను 473మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పోలవరం జిల్లాలో 578మందికి 510 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. ఈ రోజు జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో హిందీ, తెలుగు పరీక్షలు జరిగాయని చెప్పారు.

News March 5, 2026

HYDలో ఇక ‘RED’ నోటీసులు

image

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.