News March 4, 2025
హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News July 8, 2025
జగిత్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
News July 8, 2025
ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.
News July 8, 2025
NLG: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి జిల్లాకు AICC కార్యదర్శి సంపత్ కుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని అధిష్ఠానం ఆదేశించింది.