News March 4, 2025

హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

image

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్సూరెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News December 3, 2025

REMEMBER: ఇద్దరూ సీఎంలను ఓడించిన KVR

image

కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. 2023 డిసెంబర్ 3న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో, ఒకే స్థానం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆయన ఓడించి సంచలనం సృష్టించారు. ఈ అపూర్వ విజయం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

News December 3, 2025

WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

image

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.

News December 3, 2025

వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

image

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.