News August 30, 2024
హన్వాడ: GREAT.. ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు

హన్వాడ మండలానికి చెందిన గుంత చెన్నయ్య(35) ఈనెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అత్యవసర విభాగంలో వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అతడి కాలేయం, 2 కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, 2 కంటి కార్నియాలను చూపు లేని వారి అమర్చినట్లు జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.
Similar News
News February 19, 2025
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. ఎంబ్రాయిడరీ డిజైన్ లలో ఈనెల 24 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
News February 18, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
MBNR: సైబర్ వలలో ముగ్గురు వ్యక్తులు.. రూ.1.50లక్షలు స్వాహా

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్‌లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.