News April 13, 2025

హఫీజ్ ఖాన్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

Similar News

News October 27, 2025

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.