News February 13, 2026

హరిత రవాణాకు RTC అడుగులు.. TARGET 2027

image

TGRTC పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేసే రెట్రో ఫిట్‌మెంట్ విధానాన్ని సంస్థ అమలు చేయనుంది. ఈ మేరకు RTC MD నాగిరెడ్డి ఆధ్వర్యంలో గత ఏడాది టెండర్లు పూర్తిచేసి 240 బస్సుల మార్పు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. 2027 నాటికి ORR లోపల 2800 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Similar News

News March 9, 2026

షోకాజ్ నోటీసులపై సచివాలయ సర్వేయర్ల ఆగ్రహం

image

సెలవు పెట్టి ఆందోళనలో పాల్గొంటే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో క్యాజువల్ లీవ్ పెట్టి నిరసన తెలిపిన తమకు, సోమవారం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రెండు రోజుల తర్వాత సెలవులను రద్దు చేయడంపై వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు.

News March 9, 2026

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. ఇరు కుటుంబాల్లో విషాదం

image

నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మంజులాపూర్‌కు చెందిన సృజన్, నటరాజ్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. సృజన్ అక్కడికక్కడే మృతిచెందగా, పృధ్వీరాజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోగా చనిపోయాడు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.

News March 9, 2026

‘కల్కి’ కోసం కమల్ హాసన్‌కు రోజుకు ₹15 కోట్లు?

image

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్‌పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.