News August 12, 2024
హరీశ్‌రావుకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాలమైతే మీ ఖాతాలో.. కరవు వస్తే పక్కోడి ఖాతాలో వేసే నైజాం మీ పార్టీదని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరకొరగా చేసిన పంట రుణమాఫీ 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదని ఆరోపించారు. సాంకేతిక సమస్యలు చూపించి రైతులకు రుణాలు మాఫీ చేయలేదని, ఈ విషయం హరీశ్ రావుకి తెలుసని మండిపడ్డారు.
Similar News
News September 14, 2024
సిరిసిల్ల: విష జ్వరంతో బాలిక మృతి
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక విష జ్వరంతో మృతి చెందింది. కుటుంబీకుల ప్రకారం.. మైదం శెట్టి మల్లికార్జున్ పెద్ద కూతురు నక్షత్ర హాసిని(13)కి బుధవారం జ్వరం వచ్చింది. స్థానిక ఓ ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించగా నయం కాలేదు. ఆ తర్వాత సిరిసిల్ల, KNR నుంచి HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందింది.
News September 14, 2024
KNR: స్కాలర్‌షిప్స్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
2024-25 విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని SCDD కరీంనగర్ జిల్లా ఉపసంచాలకులు నాగలేశ్వర్ కోరారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ సహకరించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులు అర్హులన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గడువు తేదీ 31.12.2024.
News September 14, 2024
రామగుండంలో వందేభారత్ హాల్ట్
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.