News February 25, 2026

హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి దామోదర్ కౌంటర్

image

WGL సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు, స్లాబులు కాదని మంత్రి పేర్కొన్నారు. తొలుత 16.5 లక్షల FTI అని, ఆ తర్వాత 21.3 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి హాస్పిటల్ విస్తీర్ణాన్ని పెంచారని అన్నారు. అత్యాధునిక సేవలతో హాస్పిటల్‌ను సీఎం ప్రారంభిస్తారని, అబద్ధపు ప్రచారం మానుకోవాలన్నారు.

Similar News

News April 18, 2026

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

News April 18, 2026

గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

image

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.

News April 18, 2026

భాగ్యనగరానికి తలమానికం.. మన చార్మినార్

image

450 సంవత్సరాల క్రితం నిర్మితమైన సుందరమైన కట్టడం చార్మినార్. భాగ్యనగరానికి ఇది అమూల్యమైన వారసత్వ సంపద. ఈ కట్టడం నాలుగు శతాబ్దాలుగా ఇండో- ఇస్లామిక్ శిల్పకళా వైభవానికి, మతసామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మన సంస్కృతికి ప్రత్యేకగా నిలిచిన ఈ చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మన వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. # నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.