News February 25, 2026
హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి దామోదర్ కౌంటర్

WGL సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు, స్లాబులు కాదని మంత్రి పేర్కొన్నారు. తొలుత 16.5 లక్షల FTI అని, ఆ తర్వాత 21.3 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి హాస్పిటల్ విస్తీర్ణాన్ని పెంచారని అన్నారు. అత్యాధునిక సేవలతో హాస్పిటల్‌ను సీఎం ప్రారంభిస్తారని, అబద్ధపు ప్రచారం మానుకోవాలన్నారు.
Similar News
News April 18, 2026
కొత్త SEకి కలెక్టర్ సూచన

వరంగల్ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనందం శుక్రవారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన విద్యుత్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2న భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ భేటీలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
News April 18, 2026
కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.