News February 10, 2025

హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

image

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News March 22, 2025

విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్లలో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.38, బీరకాయలు రూ.44, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.48, గ్రీన్ పీస్ రూ.50, వంకాయలు రూ.30, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, బరబాటి రూ.24, కాలీఫ్లవర్ రూ.20, అనప రూ.24గా నిర్ణయించారు.

News March 22, 2025

తొర్రూర్‌లో బాలికకు అబార్షన్!

image

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

News March 22, 2025

ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.

error: Content is protected !!