News March 5, 2026
హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Similar News
News April 13, 2026
అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

లోక్‌సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్‌ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.
News April 13, 2026
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి అంటూ BRS చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ పార్టీ SMలో చేస్తున్న దుష్ప్రచారానికి KCRదే బాధ్యతని సీతక్క పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి KCR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
News April 13, 2026
TGTET-2026 నోటిఫికేషన్ విడుదల

TGTET-2026కు ఈ నెల 15-30 మధ్య <


