News March 18, 2025

హసన్‌పర్తి: యాక్సిడెంట్.. ఇద్దరు విద్యార్థులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పరకాల బీసీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు సుశాంత్, వర్ధన్, విజయ్ ఆదివారం రాత్రి పరకాల నుంచి ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా.. విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. ముచ్చర్ల శివారులో వీరి బైకును ఓ వాహనం ఢీకొనడంతో సుశాంత్, విజయ్ మృతి చెందారు. వర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.

Similar News

News February 22, 2026

రాజన్న ఖజానాకు కాసుల పంట.. 2 నెలల్లో రూ. 11.60 కోట్లు

image

వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు రెండు నెలల వ్యవధిలో రూ.11.60 కోట్ల ఆదాయం సమకూరింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో సుమారు నెలరోజులకు పైగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరాగా.. కోడె మొక్కులు, అభిషేకం అన్న పూజ టికెట్లు, హుండీ తదితరాల ద్వారా రూ.10.17 కోట్ల ఆదాయం సమకూరింది. మహాశివరాత్రి జాతర సందర్భంగా మరో రూ.1.43 కోట్లు ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా మరో రూ.2 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది.

News February 22, 2026

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్!

image

TG: రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 3-4 గంటల్లో ఆసిఫాబాద్, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో రాత్రివేళ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.

News February 22, 2026

నాగర్ కర్నూల్ జిల్లా.. ఇంటర్ పరీక్షలకు వేళాయె!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు.
✒ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య: 15,173
✒ మొత్తం పరీక్ష కేంద్రాలు: 34
✒ఇన్విజిలేటర్లు: 300
✒అన్ని కేంద్రాల్లో CC కెమెరాల నిఘా
✒హాల్ టికెట్లలో QR కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ వివరాలు వస్తాయి
✒సిట్టింగ్ స్క్వాడ్లు: 3
✒చీఫ్ సూపరింటెండెంట్స్- 34
✒కస్టోడియన్స్- 6
✒మెడికల్ ANMలు- 34