News September 27, 2024
హస్త కళలను ప్రజలు ఆదరించాలి: భార్గవ్ తేజ

హస్త కళలను ప్రజలు ఆదరించి కళాకారులను మరింతగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళా ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. కళాకారుల జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే క్రాఫ్ట్ బజార్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Similar News
News October 22, 2025
పారిశుద్ధ్యం, నీటి విషయంలో శ్రద్ధ వహించాలి: కలెక్టర్

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించటంతో పాటు రక్షిత తాగునీరు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో బుధవారం తమీమ్ అన్సారియా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, వ్యర్ధాల సేకరణ, నిర్వహణ, సాలిడ్, లిక్వీడ్ వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టుల పై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.
News October 22, 2025
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: కలెక్టర్

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. వాగులు, నదులు దాటుటకు, ఈదుటకు ప్రయత్నం చేయవద్దన్నారు.
News October 22, 2025
ఎస్.ఆర్.శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

ప్రజల అధికారిగా ఎస్.ఆర్. శంకరన్ ప్రసిద్ధి చెందారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శంకరన్ జయంతిని కలెక్టర్ కార్యాలయలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు చేసి నివాళులు అర్పించారు. ప్రజలతో కలిసిమెలసి పని చేసిన వ్యక్తి శంకరన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి శంకరన్ తన జీవితాన్ని అంకితం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.