News April 10, 2025
హాజీపూర్లో నవవధువు సూసైడ్.. ముగ్గురిపై కేసు

హాజీపూర్కు చెందిన నవవధవు <<16035520>>శృతి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె మృతికి కారణమైన భర్త సాయి, అత్తామామలు లక్ష్మీ, శంకరయ్యను అరెస్ట్ చేసినట్లు SI స్వరూర్రాజ్ తెలిపారు. టీకానపల్లికి చెందిన శృతికి గొల్లపల్లికి చెందిన సాయితో మార్చి 16న వివాహమైంది. అదనపు కట్నం కోసం ఆమెను అత్తింటి వారు వేధించడంతో ఈ నెల7న ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News November 6, 2025
వేములవాడ: పరిహారం ఇవ్వండి.. లేదా గెజిట్ నుంచి తొలగించండి..!

నష్టపరిహారం చెల్లించకుండా అపరిష్కృతంగా ఉన్న తమ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రైల్వే లైన్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వేములవాడలో నిరసన వ్యక్తం చేశారు. తమ భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని, లేదంటే భూములు అమ్ముకునేందుకు వీలుగా గెజిట్ నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిహారం చెల్లించకుండా, గెజిట్ నుంచి తొలగించకుండా తాత్సారం చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 6, 2025
ఖమ్మం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..!

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల తిరుమలాయపాలెం(M)నికి చెందిన ఒక వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే గొడ్డలితో నరికి హత్య చేశాడు. సత్తుపల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యని ఓ వ్యక్తి హతమార్చాడు. ఖమ్మం(R)లో సోదరుల మధ్య పంచాయితీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. చింతకాని(M)లో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను చంపింది.
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<


