News March 11, 2025

హాజీపూర్ పీహెచ్‌సీ తనిఖీ చేసిన కలెక్టర్

image

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను, మందుల నిల్వలను రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Similar News

News October 27, 2025

GWL: పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు- SP

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూవివాదాలు 4, కుటుంబ తగాదాలు1, గొడవలు 9, ఇతర అంశాలకు సంబంధించి 2, మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచరాదన్నారు.

News October 27, 2025

పోలింగ్‌లో పైచేయి… అయినా గెలిచేది తక్కువే…

image

BIHAR ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువ. అయితేనేం పోటీలో ఉండే స్త్రీలు గెలిచేది మాత్రం చాలా స్వల్పం. అంటే వారి ఓట్లు పురుష అభ్యర్థులకే ఎక్కువ పడుతున్నాయన్న మాట. స్త్రీకి స్త్రీయే శత్రువంటే ఇదేనేమో. 2005లో 24(234మందికి), 2010లో 34(307), 2020లో 26(370) మంది మాత్రమే గెలిచారు. 2020లో పోలింగ్ శాతం ఉమెన్ 59.69%, మెన్ 54.45%గా ఉంది. 2015లో అత్యధికంగా 60.48% స్త్రీల ఓట్లు పోలయ్యాయి.

News October 27, 2025

కాఫీ పొడితో కళకళలాడే ముఖం

image

కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. అయితే కాఫీపొడి చర్మసంరక్షణలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. కాఫీపొడి ఫేస్ ప్యాక్‌లతో ముఖంపై ఉండే మొటిమ‌లు, ముడ‌త‌లు, మచ్చ‌లు తొల‌గిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో కాస్త తేనె క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని బ్యూటీటిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.