News March 11, 2025
హాజీపూర్ పీహెచ్‌సీ తనిఖీ చేసిన కలెక్టర్

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను, మందుల నిల్వలను రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Similar News
News March 22, 2025
క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండండి: బాపట్ల ఎస్పీ

యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని క్రికెట్ బెట్టింగులకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. యువత బెట్టింగుల వైపు వెళ్లకుండా చదువుపై దృష్టి సాధించాలని అన్నారు.
News March 22, 2025
మెదక్: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో రాధా కిషన్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన టీచర్లకు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం ఉంటుందని పేర్కొన్నారు. మూల్యాంకనం విధులకు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని డీఈవో సూచించారు.
News March 22, 2025
ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్‌గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్‌ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.