News March 17, 2025
హాజీపూర్: పెళ్లికెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన <<15782911>>హాజీపూర్<<>>లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన ఫణీంద్రవర్మ(26) ఆదివారం బైక్ పై మంచిర్యాలలోని ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుడిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తల పైనుంచి బస్సు టైర్ వెళ్లడంతో ఫణీంద్రవర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, పాప ఉన్నారు.
Similar News
News April 23, 2025
KMR: ఈ కాలేజీలో ఒక్కరు కూడా పాస్ కాలేదు

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్‌లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో మొత్తం 53 మంది విద్యార్థులు ఉండగా ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కళాశాలలో అధ్యాపకులు లేకపోవడం, విద్య బోధన చేకపోవడంతో విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
News April 23, 2025
మెదక్: OU పరిధిలో బీ ఫార్మసీ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..
News April 23, 2025
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్‌కు చెందిన గాజంగుల రాజు 3వ సారి ఎన్నికయ్యారు. HYDలో మంగళవారం జరిగిన సంఘం మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గాజంగుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కీర్తి రమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దీంతో సంఘం నాయకులు వారి అభినందించారు.