News April 9, 2025
హాజీపూర్ మండలంలో విషాదం.. నవ వధువు ఆత్మహత్య

హాజీపూర్ మండలం గొల్లపల్లిలో శృతి అనే నవ వధువు మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గర్షకుర్తి సాయితో శృతికి ఈ నెల 16న వివాహమైంది. 9తులాల బంగారం, రూ.5 లక్షల నగదు కట్నం ఇచ్చారు. పెళ్లైన వారం నుంచి భర్త, అత్తామామ ఇబ్బందులకు పెట్టడంతో సోమవారం రాత్రి ఆమె తల్లిదండ్రులు రూ.50 వేలు ఇచ్చి వెళ్లారు. మనస్థాపానికి గురైన శృతి బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 23, 2025
HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లభించింది. TMRJC ఖైరతాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కులకు గాను 495 మార్కులు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
News April 23, 2025
లక్ష్మణచందా విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

లక్ష్మణచందా గ్రామానికి చెందిన ఓస రాజేశ్వర్, మంజూల కుమారుడు ఓస రాజ్ కుమార్‌కు ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ విభాగంలో 440కి 438 మార్కులు సాధించాడు. కష్టపడి చదివి ఉత్తమ ప్రతిభను కనబర్చిన రాజ్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
News April 23, 2025
విశాఖ పోలీసులను అభినందించిన నేపాల్ పోలీసులు

నేపాల్‌కు చెందిన ఓ మహిళ తప్పిపోయి విశాఖలో ఉన్నట్లు నేపాల్ పోలీసులు గమనించారు. ఈ మేరకు నేపాల్ పోలీసులు విశాఖ సీపీ చొరవతో గాజువాక పోలీసుల సహాయంతో ఆమె ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆమెను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ విషయమై మంగళవారం నేపాల్ పోలీసులు విశాఖ సీపీ, పోలీసులను అభినందిస్తూ లేఖ రాశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన గాజువాక పోలీసులను సీపీ అభినందించారు.