News April 1, 2025
హాజీపూర్: మేకల కాపరి అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన హాజీపూర్లో చోటుచేసుకుంది. SI వినీత వివరాలు.. ర్యాలీ కొలాంగూడకు చెందిన మేకల కాపరి భీము సోమవారం సాయంత్రం ఊరిలోకి వెళ్లి తిరిగిరాలేదు. రోడ్డు పక్కన తలకు బలమైన గాయాలతో కనిపించడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు చిన్ను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 4, 2025
వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
News April 4, 2025
KMR: 3 నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం 3 నెలల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 136 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రాణాంతకమైన ప్రమాదాల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ప్రాణాంతకం కానీ ప్రమాదాల్లో..105 మంది గాయపడ్డారు. మరో 7 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. జిల్లా పోలీసు శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పై వివరాలు వెల్లడయ్యాయి.
News April 4, 2025
రైల్వే స్టేషన్లో వ్యర్థాలకు నిప్పు.. వందే భారత్కు తప్పిన ముప్పు

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో పొగ కమ్ముకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో అటువైపు వందే భారత్ రైలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై కొంతసేపు రైలును ఆపేశారు. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదంతప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.