News March 7, 2025
హాజీపూర్: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్

వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హాజీపూర్‌లో జరిగింది. SI సురేశ్ వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన లావణ్య మంగళవారం పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం HYDకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కాగా ఆమె భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News December 1, 2025
మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్‌కు రావొద్దు’

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.
News December 1, 2025
ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్‌లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.
News December 1, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, డాక్యుమెంట్స్‌ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tcil.net.in/


