News March 17, 2025
హాట్ టాపిక్‌గా కేటీఆర్, మల్లన్న భేటీ

కేటీఆర్, హరీశ్, తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పనిప్పులా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న వారిని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.
Similar News
News April 24, 2025
పాక్‌పై సానుభూతి చూపేదిలేదు: కిషన్‌రెడ్డి

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.
News April 24, 2025
నిర్మల్: వడదెబ్బతో మత్స్యకారుడు మృతి

ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన గుమ్మల గంగారాం(40) అనే మత్స్యకారుడు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రతి రోజూ ఎండలో చేపలు వేటకు వెళ్లి వచ్చేవాడు. వేటాడిన చేపలను ముధోల్ ప్రాంతాలకు వెళ్లి విక్రయించేవాడు. ఎండలో తీవ్ర అస్వస్థకు గురై ముధోల్‌లో మృతి చెందారు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు.
News April 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.