News August 5, 2024
హాట్ సీటుగా కొమురవెల్లి ఆలయ ఛైర్మన్ పదవి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, డైరెక్టర్ల పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. యాదవ సామాజిక వర్గం ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి ఛైర్మన్ పదవిని అదే సామాజిక వర్గానికి కేటాయించాలని దేవాలయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రస్తావించారు. ఛైర్మన్ పదవికి 8 మండలాల నుంచి 22 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News September 20, 2024
MDK: నోటి మాట.. ఆ గ్రామం ఆదర్శం..!
నోటి మాటతో కట్టుబడి ఆ గ్రామస్థులందరూ కలిసి మద్యపానాన్ని నిషేధించి నేటికి 10 ఏళ్ల పైనే అవుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గూడెంగడ్డలో గ్రామస్థులు గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యపానం విక్రయించడం నేరంగా భావించి నాటి నుంచి నేటి వరకు ఎలాంటి విక్రయాలు జరుపకూడదనే నిబంధనను మౌఖికంగానే విధించుకున్నారు. దీంతో మద్యపానం విక్రయించకుండా గూడెంగడ్డ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.
News September 20, 2024
రేగోడు తహశీల్దార్ SUSPEND
రేగోడు తహశీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ రమాదేవి తహశీల్దార్ ఆఫీస్‌ను ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో ఎమ్మార్వో అందుబాటులో లేరు. దీంతో అక్కడికి వచ్చిన రైతులతో ఆర్డీఓ మాట్లాడారు. తహశీల్దార్ నిత్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు తెలిపారు. దీంతో తహశీల్దార్‌ని సస్పెండ్ చేశామని ఆర్డీవో తెలిపారు.
News September 20, 2024
MDK: రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: రోహిత్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?