News September 1, 2024
హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తుంది: కొప్పుల

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో ఆయన విలేఖరుల సమవేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణ మాఫీ చేశామని చెబుతున్నా.. అది పూర్తి స్థాయిలో జరగలేదని మండిపడ్డారు.
Similar News
News February 24, 2026
చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులతో భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.
News February 24, 2026
KNR: ఆన్లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.
News February 23, 2026
కరీంనగర్ పోలీస్ దళంలోకి రెండు కొత్త డాగ్స్

నేర పరిశోధనను మరింత వేగవంతం చేసేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ దళంలోకి రెండు నూతన పోలీస్ డాగ్స్ చేరాయి. HYD లోని ఐ.ఐ.టి.ఏ (IITA) కేంద్రంలో 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న రోలెక్స్ (ట్రాకర్), మాక్స్ (స్నిఫర్) పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి. వీటి రాకతో జిల్లాలో భద్రత వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు.


