News May 4, 2024
హామీలను స్టాప్ పేపర్‌పై రాసిచ్చిన MLA అభ్యర్థి
ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
Similar News
News November 2, 2024
బాధిత కుటుంబానికి అండగా వైసీపీ: మాజీ మంత్రి
కడియం మండలం బుర్రిలంకలోని ఓ మహిళ ఇటీవల హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
News November 2, 2024
కోనసీమ ఎస్పీకి ఫోన్ చేసిన పవన్
రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఆలమూరు మండలం మడికి చెందిన శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. చెముడులంక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వెన్నెల స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. కోనసీమ ఎస్పీతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.
News November 2, 2024
రాజమండ్రి జైలుకి పినిపే కుమారుడి తరలింపు
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు అమలాపురం కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్, ధర్మేశ్‌ల పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం వారిని అమలాపురం కోర్టులో హాజరుపరిచారు. మరో 14 రోజులు వారికి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వలు జారీ చేసింది. దీంతో వాళ్లని రాజమండ్రి జైలుకి తరలించారు.