News May 9, 2024
హామీలు ఇచ్చి మోసం చేసిన కవిత, అర్వింద్: రేవంత్ రెడ్డి
నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీలుగా కల్వకుంట్ల కవిత, అర్వింద్ ధర్మపురి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రాత్రి ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని మాట తప్పిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారిని విమర్శించారు. ఇక ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు.
Similar News
News January 19, 2025
నేడు నిజామాబాద్‌కు డీజీపీ
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.
News January 19, 2025
NZB: మెడ్ లైఫ్ మల్టీ లెవెల్ బిజినెస్‌పై కేసు ఒకరి అరెస్ట్: ACP
తమిళనాడు తిరుచరాపల్లికి చెందిన మెడ్ లైఫ్ మల్టీ లెవెల్ బిజినెస్‌పై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజావెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. డబ్బులు డిపాజిట్ చేసుకొని, తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని, చైన్ సిస్టమ్ ద్వారా కమిషన్లు ఇస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం మేరకు Med life కంపెనీ యాజమాన్యంపై నిజామాబాద్ 4వ టౌన్‌లో కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ACP తెలిపారు.
News January 19, 2025
NZB: దాశరథి శతజయంతిని ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లో ప్రధాన కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కవిత లేఖ రాశారు.