News March 19, 2025

హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి: హనుమకొండ కలెక్టర్

image

హాస్టల్‌లో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ నయీమ్ నగర్‌లోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు?, సౌకర్యాలు ఎలా ఉన్నాయని బీసీ సంక్షేమ అధికారి రామ్ రెడ్డి, హాస్టల్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 20, 2025

వచ్చే నెలలో ‘OG’ టీజర్?

image

‘హరిహర వీరమల్లు’ <<15753464>>వాయిదాతో<<>> నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ‘OG’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూవీ టీజర్‌ను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సుజీత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

News March 20, 2025

సంగారెడ్డి: ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 5న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టులకు 15,412 మందికి 15,030 మంది విద్యార్థులు హాజరయ్యారు. 97.52 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

News March 20, 2025

గేట్ ఫలితాల్లో యువతి సత్తా 

image

శ్రీకాకుళం క్యాంపస్ (ఎచ్చెర్ల) త్రిబుల్ ఐటీ చదువుతున్న విద్యార్థినీ గేట్-2025లో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులు కొమరాల శ్వేత శ్రీ, 241, అప్పన్న శ్రీనివాస్ 663 ర్యాంక్‌లు వచ్చాయని డైరక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. విద్యార్థినిని బాలాజీ గురువారం అభినందించారు.

error: Content is protected !!