News March 18, 2025
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఉద్యోగానికి మొలంగూర్ వాసి ఎంపిక

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి రాజకుమార్ ఇటీవల వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఫలితాల్లో మంచిమార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. చల్లూరి సాయిలు, కేతమ్మల కుమారుడైన రాజకుమార్.. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి చదివి తన కళ నెరవేర్చుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు రాజకుమార్‌కు అభినందనలు తెలిపారు.
Similar News
News March 19, 2025
కరీంనగర్ ఏసీపీ నరేందర్‌కు ప్రమోషన్

కరీంనగర్ టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపతి నరేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. పదోన్నతిపై ఆయనను హైదరాబాదులోని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ సందర్భంగా నరేందర్ కు కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
News March 19, 2025
KNR: ఉద్యోగులు శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పరిధిలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఆధునికరించారు. ఆధునికరించిన ఈ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ప్రారంభించారు.
News March 18, 2025
సైదాపూర్: నీటిసంపులో పడి బాలుడి మృతి

నీటిసంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం బొమ్మకల్లో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించకపోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయినా కన్పించకపోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యమైంది.