News March 18, 2025
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన నర్మాల మహిళ

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పి.లావణ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోన్-3 ఉమెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. లావణ్య ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి కేజీబీవీలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. గ్రూప్4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగం చేస్తూనే హాస్టల్ వెల్ఫేర్ జాబ్‌కు ప్రిపేరై జాబ్ కొట్టింది.
Similar News
News April 21, 2025
BSWD: జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన అభినయ్

బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన సకినాల అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటాడు. ఆల్ ఇండియాలో 2425వ ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆదివారం ఉపాధ్యాయులు, కాలనీవాసులు,తోటి విద్యార్థులు అభినయ్‌కు అభినందనలు తెలిపారు.
News April 21, 2025
కృష్ణా: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
NTR: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

ఎన్టీఆర్ జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.