News February 8, 2025

హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలి: భద్రాద్రి కలెక్టర్

image

ఆశ్రమ గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం పాల్వంచ పట్టణంలోని గురుకుల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి, మాట్లాడారు. డార్మిటరీ డోర్లు, కిటికీలు, తాగునీటి సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళికలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 14, 2025

మామిడి రైతులకు డబ్బులు విడుదల

image

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..

News October 14, 2025

జాతీయ రహదారిపై యాక్సిడెంట్

image

ఒంగోలు-గుంటూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కర్రల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రసాద్ చెక్ పోస్ట్ సిబ్బందితో చెస్ రాయించుకొనేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయంకావడంతో హైవే మొబైల్ పోలీసులు అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా సేఫ్టీ కోన్స్ ఏర్పాటు చేశారు.

News October 14, 2025

ITI&ATCలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ITI& ATC భద్రాచలం, కృష్ణ సాగర్లో 2025 వాక్ ఇన్ అడ్మిషన్ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల కోరుతున్నట్లు కృష్ణ సాగర్ ప్రిన్సిపల్ ధర్మచారి తెలిపారు. సెప్టెంబర్ సెషన్ కొరకు NCVT ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్ ITI&ATC ట్రేడ్స్‌లలో శిక్షణ పొందటానికి భద్రాచలం, కృష్ణ సాగర్లో మిగిలిన సీట్ల కోసం ఈనెల 17 వరకు అప్లై చేసుకోవాలని సూచించారు.