News March 19, 2024
హిందీ పరీక్ష రాసిన విద్యార్థికి న్యాయం చేస్తాం: కారంపూడి అధికారులు
పది పరీక్షలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని ప్రియాంకబాయికు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారని మండల విద్యశాఖ అధికారులు రవికుమార్, కాంతారావులు తెలిపారు. కారంపూడి MEO ఆఫీస్‌లో వీళ్లు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు కట్టే సమయంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు బదులు హిందీ అని అప్లికేషన్‌లో సెలెక్ట్ చేశారన్నారు. దీనివల్ల హిందీ పేపర్ ఇచ్చారన్నారు. ఈనెల 31న తెలుగు పరీక్ష రాయిస్తామన్నారు.
Similar News
News September 12, 2024
గుంటూరు: యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు
సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం 2018లో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు జడ్జ్) కేసును ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
News September 11, 2024
మంత్రి లోకేశ్‌కు హీరో సాయిధరమ్ తేజ్ విరాళం అందజేత
వరదలతో నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన చెక్కును మంత్రి లోకేశ్‌కు సచివాలయంలోని 4వ బ్లాక్‌లో అందజేశారు. ఆయనతో పాటు డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు రూ.1 కోటి వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. వారికి మంత్రి ధన్య వాదాలు తెలిపారు.
News September 11, 2024
ప్రమోషన్ వచ్చిన ఏఎస్ఐలు వీళ్లే..!
గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతులు పొందిన వారిలో షేక్.బురాన్ షరీఫ్(గుంటూరు), హెచ్.రహమాన్ (బాపట్ల), బి.జయరాణి (గుంటూరు), పి.ప్రమీలా దేవి (గుంటూరు), కె.సుబ్బమ్మ (గుంటూరు), వి.జయమ్మ (గుంటూరు), ఎస్.వెంకట రమణ (బాపట్ల) ఉన్నారు.