News September 13, 2024

హిందూపురంలో మద్యం దుకాణాలకు సీలు

image

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో శుక్రవారం వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని అన్ని మద్యం దుకాణాలకు అధికారులు సీలు వేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీలో ఉన్న అన్ని మద్యం షాపులు, బార్లు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ముందస్తుగా మూసివేశారు.

Similar News

News October 10, 2024

శ్రీ సత్యసాయి బాబాతో రతన్ టాటాకు అనుబంధం

image

టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా శ్రీ సత్యసాయిబాబా భక్తుడు. పలుమార్లు ఆయన పుట్టపర్తికి వచ్చారు. 2009 డిసెంబర్ 3న చివరిసారిగా సాయిబాబాను దర్శించుకున్నారు. సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై రతన్ టాటా ఆసక్తి చూపించేవారు. రతన్ టాటాకు ప్రశాంతి నిలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

News October 10, 2024

SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

image

SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.

News October 10, 2024

ఈ-పంట నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని ఈ-పంట నమోదు ప్రక్రియ సూపర్ చెక్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో కలిసి వ్యవసాయ అనుబంధ రంగ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.