News April 25, 2024
హిందూపురం ఎంపీ అభ్యర్థిగా షాహీన్ నామినేషన్ దాఖలు

హిందూపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షాహీన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. సాదాసీదాగా ఆయన నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. సినీయర్ నాయకుడు బాలాజీ మనోహర్ ఆయన వెంట వచ్చారు.
Similar News
News December 5, 2025
స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఎం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో స్క్రాబ్ టైపస్ కేసులు నమోదు అవుతున్న కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవి శుక్రవారం తెలిపారు. తలనొప్పి, జ్వరం, శరీరం మీద దద్దర్లు, కళ్లకలక వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని తెలిపారు.
News December 4, 2025
రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీతో కలిసి నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
News December 4, 2025
అనంతపురం జేఎన్టీయూలో శిక్షణా తరగతులు

అనంతపురం జేఎన్టీయూలో RTIH ఆధ్వర్యంలో స్పార్క్ 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.సుదర్శన్ రావు, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. స్పార్క్ కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ యువతలో సృజనాత్మక ఆలోచనల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. స్టార్టప్ రంగంలో వీరికి మార్గదర్శక అందించడంలో ఈ వేదిక కీలక భూమిక పోషిస్తుందన్నారు.


