News February 16, 2025

హిందూపురం ఎక్సైజ్ సీఐగా లక్ష్మీ దుర్గయ్య బాధ్యతల స్వీకరణ

image

హిందూపురం ఎక్సైజ్ సీఐగా లక్ష్మీ దుర్గయ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. 2 నెలల క్రితం ఎక్సైజ్ సీఐని కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నతాధికారులు బదిలీ చేశారు. విచారణ తర్వాత లక్ష్మీ దుర్గయ్య ఎక్సైజ్ సీఐగా కచ్చితత్వం కలిగిన అధికారిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో గతంలో పనిచేసిన హిందూపురం స్థానానికే ఆయనను బదిలీ చేశారు.

Similar News

News February 24, 2026

KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్‌!

image

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.

News February 24, 2026

​బాపట్ల: కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల

image

​బాపట్ల జిల్లాలో మిగిలిపోయిన 5 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బాపట్ల మున్సిపాలిటీలో 2, రేపల్లెలో 3 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి నరేశ్ కుమార్ తెలిపారు. ఆసక్తిగలవారు రూ.5 లక్షల అప్లికేషన్ ఫీజు, రూ.10 వేల ప్రాసెసింగ్ ఫీజుతో మార్చి 2వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 24, 2026

NRPT: ఎత్తిపోతల పథకం భూ సేకరణకు క్యాబినెట్ ఆమోదం

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ కోసం నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొదటి, రెండో దశ ప్రాజెక్టులతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు భూ సేకరణకు రూ.1,275 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. మంత్రివర్గ ఆమోదంతో ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.