News March 9, 2025
హిందూపురం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.
Similar News
News November 8, 2025
వేములవాడలో కొండెక్కిన కొబ్బరికాయ ధరలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దేవాలయం వెళ్లాలన్నా, ఇంట్లో పూజ చేయాలన్నా కొబ్బరికాయ తప్పనిసరి కావడంతో, భక్తుల సెంటిమెంట్‌ను దుకాణదారులు ఆసరాగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో కొబ్బరికాయను సాధారణ కిరాణా దుకాణాల్లో సైతం రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
News November 8, 2025
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

ఎయిమ్స్ బిలాస్‌పుర్ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in
News November 8, 2025
‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

క్యాలెండర్‌లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.


