News February 25, 2025
హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

హిందూపురం దివంగత మాజీ శాసనసభ్యుడు రంగనాయకులు సతీమణి ఈశ్వరమ్మ మంగళవారం ముదిరెడ్డిపల్లిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మహేశ్ గౌడ్ ఈశ్వరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగనాయకులకు సహధర్మచారిణిగా అన్ని పార్టీల నాయకులకు ఈశ్వరమ్మ సుపరిచితురాలని పేర్కొన్నారు. కాగా రంగనాయకులు 1985-85, 2004-9 మధ్య MLAగా ఉన్నారు.
Similar News
News February 26, 2025
NRPT: పథకాలు నేరుగా రైతులకు చేరవేయాలి: అదనపు కలెక్టర్

ప్రభుత్వం అమలు చేసే పథకాలను రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరెట్లో వ్యవసాయశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం కిసాన్‌కు పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతుల వివరాలను ధృవీకరించాలని, కేవైసీ చేసుకొని రైతులను గుర్తించి చేయించాలని చెప్పారు.
News February 26, 2025
డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు పూర్తిచేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అయన మంగళవారం పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 26, 2025
వికారాబాద్‌లో మంగళవారం నాటి ముఖ్యాంశాలు

✓వికారాబాద్: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్. ✓లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్. ✓బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య. ✓పరిగి: తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు. ✓మహా కుంభమేళాలో ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ. ✓తాండూర్: శరవేగంగా రైల్వేస్టేషన్లో సుందరీకరణ: జీఎం అరుణ్ కుమార్ జైన్. ✓కొడంగల్: మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు.