News February 3, 2025
హిందూపురం మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం

హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23 మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.
Similar News
News November 16, 2025
పార్వతీపురం: ‘సివిల్స్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News November 16, 2025
రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని మహేశ్ (21) MBA విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మహేశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలోని అన్నమాచార్య కాలేజీలో చదువుతున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 16, 2025
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం: మంత్రి కోమటిరెడ్డి

సమాజ సమస్యలను ధైర్యంగా ప్రజల ముందుకు తెస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్స్పీరియం ఎకో పార్కులో జరిగిన జర్నలిస్టుల కుటుంబాల గెట్-టు-గెదర్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీడియా మిత్రుల పట్ల తనకు గౌరవం, కృతజ్ఞతలు ఉన్నాయని మంత్రి తెలిపారు.


