News September 15, 2024
హిందూపురం: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి
హిందూపురం మండలం బీరేపల్లి సమీపంలోని కేమల్ పరిశ్రమ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ జవాన్ అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం నుంచి గోరంట్ల వైపు వెళుతున్న కారు వెళ్తుండగా గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంలో అచ్చప్ప హిందూపురం వస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 7, 2024
పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు: కలెక్టర్
అనంతపురం జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ పి.జగదీష్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 15వ తేదీ తర్వాత జిల్లాలో ఉన్న 5 ఇసుక రీచ్‌లు మ్యానువల్ ఆపరేషన్‌లో ఉంటాయన్నారు.
News October 6, 2024
కదిరిలో ఘోరం.. పసి బిడ్డను వదిలి వెళ్లిన కసాయి తల్లి
స్థానిక RTC బస్‌స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ICDS వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 6, 2024
శింగనమల: పిడుగుపాటుకు యువకుడి మృతి
అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శింగనమల మండలం పెద్దకుంటలో కురిసిన వర్షానికి పిడుగు పడి శింగనమల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఋషింగప్ప(27) శంకర్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.