News July 16, 2024
హిందూపురం: 12ఏళ్లకే భగవద్గీత శ్లోకాలు చూడకుండా చెప్పడంలో దిట్ట
హిందూపురానికి చెందిన రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ 12ఏళ్లకే భగవద్గీతలోని 700 శ్లోకాలను చూడకుండా వినిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఏ శ్లోకం అడిగినా సులువుగా చెప్పగలగడంలో దిట్ట. భగవద్గీతపై ఆసక్తితో మైసూరులోని దత్తపీఠం నుంచి 7నెలల ఆన్‌లైన్‌లో శిక్షణ పొందాడు. పీఠంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రతిభచాటి గణపతి సచ్చిదానంద చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.
Similar News
News October 7, 2024
లేపాక్షి: డివైడర్‌ను ఢీకొన్న కారు..ఇద్దరి మృతి
లేపాక్షి మండలంలోని చోళ సముద్రం సమీపంలో డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. బ్రహ్మకుమారీ ఆశ్రమంలోని 8 మంది ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మడకశిర వెళ్లి తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు కుంగి ఉండడంతో కారు బోల్తా పడింది. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎ. సరస్వతమ్మ, నారాయణమ్మలు మృతి చెందారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 7, 2024
కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇలా..!
అనంతపురం పట్టణం పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. ఆదివారం మొత్తం 18 మండీలకు 675 టన్నులు వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ.52, మధ్యస్థం రూ.40, కనిష్ఠం రూ.30 చొప్పున ధరలు పలికాయి. 15 కిలోల బుట్ట ధర గరిష్ఠం రూ.780, మధ్యస్థం రూ.600, కనిష్ఠం రూ. 450 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ యార్డు ఇన్‌ఛార్జి రాంప్రసాద్ రావ్ ఓ ప్రకటనలో తెలిపారు.
News October 7, 2024
పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు: కలెక్టర్
అనంతపురం జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ పి.జగదీష్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 15వ తేదీ తర్వాత జిల్లాలో ఉన్న 5 ఇసుక రీచ్‌లు మ్యానువల్ ఆపరేషన్‌లో ఉంటాయన్నారు.