News March 20, 2025

హిందూ గుళ్లపై ప్రభుత్వం పెత్తనం చేయొద్దు:సిర్పూర్MLA

image

హిందూ దేవాలయాలపై పెత్తనం చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ సహా ఇతర మైనార్టీ సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ గురించి అలాంటి ధోరణి కనబడటం లేదన్నారు. పురాతన దేవాలయాల నిర్వహణకు నోచుకోని ఆలయాల కోసం CGF నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

image

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 3, 2025

సంగారెడ్డి: రేపు హాకీ ఉమ్మడి జిల్లా పోటీలు

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాకీ బాలబాలికల అండర్-14, 17 ఉమ్మడి మెదక్ జిల్లా పోటీలు సంగారెడ్డిలోని అంబేద్కర్ మేధావులు నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్‌తో ఉదయం 9 గంటలకి హాజరుకావాలని చెప్పారు.

News December 3, 2025

పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.