News March 20, 2025
హిందూ గుళ్లపై ప్రభుత్వం పెత్తనం చేయొద్దు:సిర్పూర్MLA

హిందూ దేవాలయాలపై పెత్తనం చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ సహా ఇతర మైనార్టీ సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ గురించి అలాంటి ధోరణి కనబడటం లేదన్నారు. పురాతన దేవాలయాల నిర్వహణకు నోచుకోని ఆలయాల కోసం CGF నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
SVU పరీక్షల వాయిదా

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST
News April 21, 2025
మెదక్: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో తెలపాలని ఎస్పీ సూచించారు.