News April 24, 2024
హిరమండలం:అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

హిరమండలం రెల్లివీధికి చెందిన కళింగపట్నం ధనుంజయ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ధనుంజయకు రూ.5000 అప్పుగా ఇచ్చిన పందిరి రాజా అనే వ్యక్తి, అతని అనుచరులు అప్పు తీర్చమని ఇటీవల దారుణంగా కొట్టి, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులకు భయపడి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు తండ్రి భూలోకం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 9, 2025
ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
News November 9, 2025
SKLM: ‘ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు’

జాతీయ విద్య దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, ‘భారత రత్న’ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
News November 9, 2025
మాంగోలియా జైల్లో ఇరుక్కున్న సిక్కోలు వాసి

ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఓ శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అక్కడి జైల్లో ఇరుక్కున్నాడు. సంతబొమ్మాళి(M) లక్కీవలస పంచాయతీ పిట్టవానిపేటకు చెందిన తూలు గారయ్య 5నెలల అగ్రిమెంట్తో పెయింటింగ్ పనులకు వెళ్లాడు. ఈనెల 7న ఇండియాకు వస్తానంటూ అక్కడి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసిన తన భర్త ఇప్పటి వరకు రాలేదని భార్య తూలు ఎర్రమ్మ వాపోయారు. ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరుతున్నాడు.


