News August 23, 2024

హిరమండలం: అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

image

హిరమండలం మండలం భగీరథపురానికి చెందిన పడాల పార్థివ్ శ్రీ వత్సల్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. పార్థివ్ తల్లిదండ్రులు లక్ష్మీ, అప్పలనాయుడు టీచర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి సారి 1నుంచి 50 వరకు గణంకాలను 1:36 నిమిషాల్లో, 2వ సారి 1 నుంచి 100 వరకు గణంకాలను 4:24 నిమిషాల్లో, 3వ సారి అన్ని దేశాల జాతీయ జెండాలను 2:16 నిమిషాల్లో గుర్తించి రికార్డును సాధించాడని వివరించారు.

Similar News

News September 18, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News September 18, 2024

రేగిడి: సూసైడ్‌ లెటర్‌ రాసి విద్యార్థి ఆత్మహత్య

image

రేగడి ఆమదాలవలస అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన గోగుల యోగేశ్వరరావు(20) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ‘దానిలో తాను కెరియర్లో సక్సెస్ అవ్వలేక పోతున్నా, కుటుంబ సభ్యులను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రయత్నించా, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నా’ అంటూ విద్యార్థి రాశాడు.

News September 18, 2024

ఏపీ పీజీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం

image

ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో మొదటి విడత అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయింది. 542 సీట్లు ఉండగా 259 ప్రవేశాలు జరిగాయి. ఇంకా 303 సీట్లు మిగిలి ఉండటంతో రెండో విడత కౌన్సిలింగ్‌కు ఈనెల 19 లోపు రిజిస్ట్రేషన్, 21న ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 23, 25న వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.