News March 28, 2025

హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

image

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.

Similar News

News November 22, 2025

అవకాడోతో కురులకు మేలు

image

అవకాడో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంతోపాటు కురులకూ మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోని హెయిర్ ప్యాక్‌తో జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు తొందరగా పెరుగుతుంది. అవకాడో, అరటి పండు పేస్ట్‌ చేసి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15రోజులకొకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

News November 22, 2025

ఏలూరు: ఈనెల 24న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాలకు అండర్-14, 17 బాల, బాలికల క్రికెట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 24న పెదవేగి మండలం వంగూరు ANM క్రికెట్ అకాడమీలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడా దుస్తులు, బ్యాట్, బాల్, ప్యాడ్‌లతో హాజరుకావాలన్నారు.

News November 22, 2025

శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.